ఆలయా నిర్మాణానికి భూమి పూజ
అచ్చన్నపేట (జనం సాక్షి) మార్చి 24:
బచ్చన్నపేట మండల కేంద్రంలో గల రజక సంఘం అధ్వర్యంలో వారి కుల దైవమైన
శ్రీ మడివెలు మచయ్య ఈదమ్మ ల ఆలయ నిర్మాణం కొరకు వారికి చెందిన మాన్యం భూమిలో స్థానిక సర్పంచి వడ్డేపల్లి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనగా భూమి పూజ చేసి ముగ్గు పోసినట్లు రజక సంఘం కుల పెద్ద మినలాపురం చెన్నయ్య తెలిపారు. అనంతరంచెన్నయ్య మాట్లాడుతూ. సంఘం యొక్క నిధులతో ఇట్టి ఆలయ నిర్మాణం చేపడ్తున్నట్లు కుల పెద్దలు తెలిపారు.ట్టి ఆలయ నిర్మాణానికి దాతలు ముందుకు రావాలని6 కులస్థులు కోరారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు పెలి మే లి వెంకటయ్య. సిద్దయ్య. పోచంపల్లి సిద్ధులు. పోచంపల్లి శ్రీను. మిల్లాపురం సిద్దయ్య. దేవరకొండ రమేష్. దేవరకొండ శ్రీను. మేస్త్రి గర్నెపెల్లి కేశయ్య పాల్గొన్నారు