ఆవేశానికి నిండు ప్రాణం బలి

కాకినాడ: ఆవేశానికి నిండుప్రాణం  బలైన సంఘటన కాకినాడలో జరిగింది. స్థానికి జగన్నాదపురంలో ఒకరింట్లో పెళ్లికి తాడేపల్లిగూడెం నుంచి వరుడి తరపు బంధువులు వ్యానులో తరలివచ్చారు.వ్యాన్‌ని వీధిలో నిలిపి పెళ్లిసందడిలో మునిగారు. తన ఆటోతో అటుగా వెళ్తున్న కొటికలపూడి రమేశ్‌ వ్యాన్‌ రోడ్డుకు అడ్డంగా ఎందుకు పెట్టారని పెళ్లివారిని ప్రశ్నించారు. అది కాస్తా ఘర్షణగా మారి అందరూ కలిసి ఆటోడ్రైవర్‌ రమేశ్‌ను చితకబాదారు. అతడిని  ఆస్ప్రత్రికి తరలించేసరికే మృతి చెందాడు. పెళ్లి బృందానికి చెందిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.