ఆసక్తికరంగా టిఆర్‌ఎస్‌ పోస్టర్లు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి):టిఆర్‌ఎస్‌ ఆద్వర్యంలో జరుగుతున్న ప్రగతి నివేదన సభ ప్రచారంలో భాగంగా ఆ పార్టీ ఇచ్చిన పలు నినాదాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ముందస్తు ఎన్నికలపై నిర్దిష్టంగా చెప్పకపోయినా, పోస్టర్‌ లలో మాత్రం ఎన్నికల విషయం తెలియచేస్తున్నారు. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారన్న నినాదంతో పాటు కెసిఆర్‌ మళ్లీ రావాలి అన్న నినాదం ఉన్న పోస్టర్లు కూడా పెద్ద ఎత్తున వేశారు. సాదారణంగా అయితే మరో ఎనిమిదినెలల తర్వాత కాని ఎన్నికలు రావు. ఇప్పుడే ఇలాంటి నినాదాలు ఇస్తున్నారంటే ముందస్తు ఎన్నికలే అన్న భావన కలుగుతోందని అంటున్నారు.