ఆసియన్‌ అధ్లెటిక్‌ పోటీలు తమిళనాడులో జరగవు

చెన్నై: జూలైలో జరగాల్సిన ఆసియన్‌ అథ్లెటిక్స్‌ పోటీలు తమిళనాడులో నిర్వహించబోమని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత  ప్రకటించారు. శ్రీలంకని ఇందులో పాల్గొనవద్దని కేంద్రం చెప్పనందునే అమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆసియన్‌ అథ్లెటిక్స్‌లో శ్రీలంక పాల్గొనడం వల్ల తమిళుల మనోభావాలు దెబ్బతింటాయని ఆమె పేర్కొన్నారు. ఇరవైఏళ్లు దాటాక ఈ క్రీడలు భారత్‌లో  జరుగుతున్నాయి. క్రీడల్లో పాల్గొనకుండా శ్రీలంకపై నిషేధం విధించమని జయలలిత కేంద్రాన్ని కోరారని, కేంద్రం స్పందించలేదని సమాచారం తెలిసింది.

తాజావార్తలు