ఆస్ట్రేలియా ఓపెన్‌ నుంచి భారత్‌ ఔట్‌

మెల్‌బోర్న్‌ : ఆస్ట్రేలియా ఓపెన నుంచి భారత్‌ నిష్క్రమించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో క్వార్టర్‌ ఫైనల్స్‌ వరకూ వచ్చిన సానియా, మహేశ్‌భూపతి ఈరోజు తమ తమ మ్యాచ్‌లలో పరాజయం ఎదుర్కోన్నారు. సానియా తన అమెరికన్‌ భాగస్వామి బాబ్‌బ్రయాన్‌తో కలిసి  జెక్‌ రిపబ్లిక్‌కి చెందిన జంట చేతిలో ఓడిపోయింది. రష్యాకు చెందిన పెట్రోవా, భూపతి జంట ఆస్ట్రేలియాన్‌ జంట చేతిలో పరాజయం పాలయ్యింది.