ఆస్ట్రేలియా ఘన విజయం

కొలంబో: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండిస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. 192 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 9.1 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 100 పరుగులు చేసిన సమయంలో మ్యాచ్‌కు వరణుడు అడ్డుపడ్డాడు. కొంత సమయం వేచి చూసిన అంఫైర్లు వర్షం తగ్గే సూచనలు లేకపోవడంతో మ్యాచ్‌ను డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిలో విజేతను నిర్ణయించారు. దీంతో ఆస్ట్రేలియా వెజేతగా నిలిచింది.