ఇంగ్లండ్‌ స్కోరు 196

కొలంబొ: టీ20 వరల్డ్‌కప్‌లోఒ ఇంగ్లాండ్‌, ఆఫ్ఘనిస్థాన్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఐదు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆఫ్ఘనిస్థాన్‌ ముందు 197 పరుగుల విజయలక్ష్యాన్ని నిలిపింది. బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ జట్టులో రైట్‌ 99(నాటౌట్‌), అలెక్స్‌ హేల్స్‌ 31, మోర్గాన్‌ 27, బట్లర్‌ 15 పరుగులు చేశారు. బౌలింగ్‌ చేసిన ఆఫ్ఘనిస్థాన్‌ జట్టులో దావ్లాత్‌ జై 2, దావ్లాత్‌ జద్రాన్‌, షాపూర్‌ జద్రాన్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు.