ఇంగ్లండ్‌ 330 పరుగులకు ఆలౌట్‌

నాగ్‌పూర్‌ : భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 330 పరుగులకు ఆలౌట్‌ అయింది. 5 వికెట్ల నష్టానికి 199 పరుగులతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌ మరో 131 పరుగులను జోడించింది. పీటర్సన్‌ 73, రూట్‌ 73, ప్రియర్‌ 57, స్వాన్‌ 56, ట్రోట్‌ 44 పరుగులు చేశారు. భారత బౌలర్లలో చావ్లా 4, ఇషాంత్‌ శర్మ 3, జడేజా 2, అశ్విన్‌ ఒక వికెట్‌ తీశారు.