ఇంగ్లాండ్‌ పై వెస్టిండీస్‌ విజయం

పల్లెకెలె: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్‌ 8 విభాగంలో వెస్టిండీస్‌ జట్టు బోణీ కొట్టింది. పల్లెకెలె వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై 15 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన వెస్టిండీస్‌ జట్టు నిర్ణీత 2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. ఓపెనర్లు జాన్సన్‌ చార్లెన్‌ 84, క్రిన్‌ గేల్‌ 58, అర్ధ శతకాలు సాధించారు. వీరిద్దరు మొదటి వికెట్‌కి 103 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 18ఏ పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి కీస్వెట్టర్‌ డకౌట్‌ అయినప్పటికీ మరో ఓపెనర్‌ అలెక్స్‌ హేల్స్‌ 68 పరుగులతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఆఖర్లో మోర్గాన్‌ 36 బంతుల్లో 71 దూకుడుగా ఆడినప్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. వెస్టిండీస్‌ బౌలర్లు రవి రాంపాల్‌ రెండు, క్రిన్‌ గేల్‌ శామ్యూల్స్‌ చెరో ఒక వికెట్‌ పడగొట్టారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో స్టువర్ట్‌ బ్రాడ్‌ రెండు, ఫిన్‌, డెర్న్‌బాచ్‌, స్వాన్‌ ఒక్కో వికెట్‌ తీసుకున్నారు.