ఇండియా సింమెంట్‌ ఎండీ విచారణ పూర్తి

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో బీసీసీఐ అధ్యక్షుడు, ఇండియా సిమెంట్స్‌ ఎండీ శ్రీనివాస్‌ మరోసారి సీబీఐ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. ఇండియా సిమెంట్స్‌కు నీటి కేటాయింపుల వ్యవహారంలో కిందటి వారం శ్రీనివాసన్‌ను విచారించిన సీబీఐ ఈ రోజు మరోసారి ప్రశ్నించింది. కడప జిల్లాలో భూమి లీజుల పొడగింపు ద్వారా ప్రయోజనం పొందిన వ్యవహారంపై అప్పటి మార్కెట్‌ ధరలకు పొంతన లేకుండా భారతీ సిమెంట్స్‌ వాటాల కొనుగోలు అంశంపై అధికారులు ప్రత్యేకంగా ప్రశ్నించినట్లు సమాచారం.