ఇందిరమ్మ తోబుట్టు ప్రారంభించిన దుబ్బాక కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తీక గౌడ్

జనం సాక్షి దుబ్బాక. దౌల్తాబాద్ మండలం
తిరుమలపూర్ గ్రామం 108 అంబులెన్స్ డ్రైవర్ నిరుపేద కుటుంబానికి చెందిన నీరుడు. ప్రవీణ్ (25) రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది.అయనకు ఇద్దరు పిల్లలు. ఇటీవలే అయనకి ఆడపిల్ల జన్మించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్,తెలంగాణ కాంగ్రెస్ అధికార ప్రతినిధి దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ నాయకురాలు కత్తి కార్తీక గౌడ్ అక్క. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, “ఇంద్రమ్మ తోబుట్టు” కార్యక్రమం భాగంగా ఆ ఇంటిలో పుట్టిన మొదటి ఆడబిడ్డకు బేబీ కిట్,బేబీ డ్రెస్,5000/- రూపాయిల పోస్టల్ ఫిక్స్డ్ డిపోసిట్ బాండ్ మరియు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు “టిపిసిసి మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ” కర్నల్ శ్రీనివాస్ రావు, సత్యం,రజనరుసు(మాజీ M.P.T.C),కొత్త దేవి రెడ్డి(దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్),సత్తు.అశోక్ రెడ్డి, రాజయ్య,మల్లేశం,వెంకటయ్య, బాలయ్య ,శ్రీనివాస్ గౌడ్,ఐరని సాయితేజ గౌడ్,వెంకట్ గౌడ్,ఎల్లం తదితరులు పాల్గొన్నారు.