ఇందిరాపార్కు వద్ద ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్: సమర దీక్ష నేపథ్యంలో ఇందిరాపార్కు, పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇందిరాపార్కు నుంచి వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సమరదీక్ష వద్ద భారీగా పోలీసులు మోహరించారు.