ఇందిరాపార్కు వద్ద తెదేపా ధర్నా

హైదరాబాద్‌: విద్యుత్‌ సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా తెదేపా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ ఇందిరా పార్కు వద్ద ఆపార్టీ నేతలు ధర్నాకు దిగారు. ఈ ఆందోళనలో తెదేపా ఎమ్మెల్యేలు మోత్కుపల్లి, ఎర్రబెల్లి, తలసా నితోపాటు ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఈ ధర్నాకు హాజరుకానున్నారు, రైతులకు ఏడు గంటల విద్యుత్‌తోపాటు కోతలు ఎత్తివేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని నేతలు హెచ్చరించారు.