ఇందిరామ్మ బాటలో పాల్గొన్న సీఎం

ఆమదాలవలన: శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి ఇందిరమ్మబాట కార్యక్రమం ప్రారంభమైంది. మూడు రోజుల పర్యటన కోసం ఈ ఉదయం జిల్లాకు చేరుకున్న  సీఎం ఆమదాలవలన మండలంలో నిర్వహించిన ఇందిరమ్మ బాట కర్యాక్రమంలో పాల్గొన్నారు. మండాదిలో శాఖ గ్రంథాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. మొదటి రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలతోపాటు స్వయం శక్తి సంఘాల సభ్యులు, రైతులతో సీఎం ముఖాముఖి నిర్వహించనున్నారు.