ఇకనుంచి దరఖాస్తులు ఆన్‌లైన్‌లోనే…

నిజామాబాద్‌, జనవరి 4 (): ఈ విద్యాసంవత్సరంలో ఉపకారవేతనాల కోసం 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అదనపు జెసి శ్రీరాంరెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్ళలో కొత్త మెనూ అమలుపై ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో సంక్షేమశాఖ అధికారులు, ఎంఈవోలు, వార్డెన్‌లు పాల్గొన్నారు.