ఇక నుంచి ఆర్యన్ కాదు అనయ
సంజయ్ బంగర్ టీమిండియా తరపున 12 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు. అతను భారత జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా కూడా పనిచేశాడు. అంతే కాకుండా, అతను RCB సహా కొన్ని జట్లకు ప్రధాన కోచ్‌గా కనిపించాడు. తాజాగా తన కొడుకు విషయంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాడు.
టీమిండియా మాజీ ఆటగాడు సంజయ్ బంగర్ కొడుకు కాదు, కాదు కూతురు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లు నెటిజన్లకు షాకివ్వడం గమనార్హం. సంజయ్ బంగర్ పెద్ద కుమారుడు ఆర్యన్ హార్మోన్ల మార్పునకు గురై ఇప్పుడు అబ్బాయి నుంచి అమ్మాయిగా మారినట్లు వెల్లడించాడు. అలాగే ఇక నుంచి నా పేరు ఆర్యన్ కాదు అనయ అంటూ చెప్పుకొచ్చింది.
అదేవిధంగా అనయ గత 10 నెలలుగా హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ తీసుకుంటోంది. 10 నెలల సర్జరీ తర్వాత ఇప్పుడు అమ్మాయిగా రూపాంతరం చెందానని చెప్పుకొచ్చింది. అలాగే దీని కోసం నా క్రికెట్ కెరీర్‌ను త్యాగం చేశానని అనయ తెలిపింది.
ఆర్యన్ బంగర్ కూడా తన తండ్రిలాగే క్రికెటర్ కావాలని కలలు కన్నాడు. అందుకు తగ్గట్టుగానే చిన్నతనం నుంచే క్రికెట్ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందిన ఆర్యన్, లీసెస్టర్‌షైర్‌లోని హింక్లీ క్రికెట్ క్లబ్ తరపున ఆడాడు.
అయితే, ఆ తర్వాత శరీరం మొత్తం మారిపోవడంతో శస్త్ర చికిత్స చేశారు. దీంతో ఆర్యన్ అయిన బంగర్ కొడుకు ఇప్పుడు అనయగా మారిపోయింది. నా ఈ నిర్ణయంతో తాను కూడా చాలా సంతృప్తిగా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది. అనయ బంగర్ ప్రస్తుతం ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌లో నివసిస్తోంది. ఇప్పుడు అమ్మాయిగా రూపాంతరం చెందిన ఈమె రానున్న రోజుల్లో తన క్రికెట్ కెరీర్‌ను కొనసాగిస్తుందో లేదో చూడాలి.