ఇచ్చిన హావిూలను పట్టించుకోని మోడీ 

ఆత్మవిమర్శకు దూరంగా పాలన
ప్రజల్లో ఇప్పుడిదే ప్రధాన చర్చ
న్యూఢిల్లీ,మార్చి14(జ‌నంసాక్షి):  కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తి కావస్తోంది. 60 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన  కాంగ్రెస్‌ దేశాన్ని అన్ని విధాలా భ్రష్టు పట్టించింది. దేశాన్ని నిర్వీర్యం చేసింది. అందులో ఎలాంటి సందేహం కానీ అనుమానం కానీ అక్కర్లేదు. తమకు ఐదేళ్లు పాలించే సేవాభాగ్యాన్ని కల్పిస్తే అద్భుతాలు చేస్తానని, ప్రజలకు జవాబుదారీగా ఉంటానని మోడీ ఘంటాపథంగా చెప్పారు. అయితే మోడీ పాలన ఆ¬ ఓ¬ అంటూ వందిమాగధుల పొగడ్తలకు పడిపోకుండా ఏం జరగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదని సొంత పార్టీ నేతలు అంటున్నారు.  2014 సార్వత్రిక ఎన్నికల్లో కమలదళానికి భారీ విజయాన్ని సాధించి పెట్టిన ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా పాలన సాగించిన మోడీ ఆత్మపరిశీలన చేసుకోవడం లేదు. ప్రధాని నరేంద్రమోదీ నవభారతాన్ని ఆవిష్కరిస్తామని, పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేస్తామని అంటున్న మాటలు నిజం అయ్యాయా లేదా అన్నది మననం చేసుకోవాల్ని విశ్లేషకులు అంటున్నారు. 125 కోట్ల మంది ప్రజలను కలుపుకొని నవ భారత్‌ రూపకల్పనకు ముందుకు కదలాలి. 2022 నాటికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లవుతున్న సందర్భంగా దేశాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లే సంకల్పంతో ముందుకెళ్లాలన్న సంకల్పానికి కార్యాచరణ ఉండాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఇప్పటికైనా  గమనించాలి. లోపాలుంటే సరిదిద్దుకొని ముందడుగు వేస్తామని సంకల్పం ప్రకటించాలి. అప్పుడే దానికి సార్థకత ఉంటుంది. అయితే ఇవన్నీ మోడీ చెప్పివే.  కాంగ్రెస్‌కన్నా భిన్నంగా పాలన సాగడంతో పాటు, పాలనలో విప్లవాత్మక ధోరణులు రావాలి. కానీ పాలనలో అలాంటివేవీ కనపడడం లేదు. వివిధ రంగాల్లో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది.
మంత్రులు తమతమ శాఖల వారీగా ప్రగతి నివేదికల్ని విడుదల చేయబోతున్నారు. ఈ దశలో అసలు ఏం జరగుతుందో గమనించాలి. 2014లో అధికారంలోకి వచ్చిన నాటికి ధరలు ఎలా ఉన్నాయో బేరీజు వేసుకోవాలి. ద్రవ్యోల్బణం పెరిగిందా లేదా తెలియచేయాలి. శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయా అన్నది చూడాలి. డాలర్‌ రేటు ఎందుకు పెరిగిందన్నది చూడాలి. విదేశాల్లో దాగిన నల్లధనం వెలికితెస్తామన్న హావిూ ఏమయ్యింది. గోడౌన్లలో మగ్గిపోతున్న ధాన్యం పుచ్చి పోకుండా ప్రజలకు పంచుతామన్న హావిూ ఏమయ్యింది. ఇలా చెప్పుకుంటూ పోతే వైఫల్యాల జాబితా చాంతాడంత ఉంటుంది. ప్రతిపక్షాలను కకావికలం చేయగలిగిన విజయోత్సాహం తప్ప బిజెపికి మరోటి కనిపించడం లేదు. ఇప్పటికైనా ప్రధాని మోడీ ప్రజల సమస్యలను తెలుసుకుని ముందుకు సాగాల్సి ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  అలా  ముందుకు నడిస్తేనే చెప్పిన మాటలకు, ఇచ్చిన హావిూలకు విలువ ఉంటుంది. ప్రజలు ఎన్నో ఆశలతో బిజెపికి అందలం ఎక్కిస్తే అందుకు అనుగుణంగా కిందిస్థాయిలో హావిూలు నెరవేరి ప్రజలు బాగుపడుతున్నారా లేదా అన్నది చూడాలి. అవే ఇప్పుడు ప్రజల్లో చర్చ నడుస్తోంది. ఈ దశలో బిజెపికి ఎన్నికల్లోగ ఎలుపు అన్నది అంత సులువు కాదని కూడా సర్వేలు చెబుతున్నాయి.