ఇద్దరు చిన్నారులు అదృశ్యం

హైదరాబాద్‌ జ‌నంసాక్షి : ఆదిలాబాద్‌ జిల్లా కాసిపేట మండలం ధర్మారావుపేటలో ఇద్దరు చిన్నారులు అదృశ్యమయ్యారు. నిన్న రాత్రి 8గంటల సమయంలో సంతోష్‌(8), అజయ్‌ అదృశ్యమైనట్లు చిన్నారుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.