ఇద్దరు వ్యక్తులను హత్యచేసిన గుర్తుతెలియని వ్యక్తులు
మదనపల్లి: మదనపల్లి మండలంలోని చిన్నాయన చెరువు పల్లెలో శనివారం రాత్రి సుధాకర్ రెడ్డి(40), లక్ష్మినారాయణ(28) దారుణ హత్యకు గురయ్యారు. అదే గ్రామానికి చెందిన రామకృష్ణరెడ్డికి సుధాకర్‌రెడ్డికి మధ్య వివాదం ఉంది. ఈ నేపథ్యంలో రామకృష్ణరెడ్డి మూడు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేస్తారనే భయంతో సుధాకర్‌రెడ్డి, లక్ష్మినారాయణలు పోలం వద్దకి వెళ్ళి పడుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు కొడవళ్లతో దాడిచేసి వారిఆద్దరిని నరికి హత్యచేశారు. స్థానికులు మాత్రం రామాకృష్ణరెడ్డి వర్గమే చంపిందనే ఆరోపనలు వస్తున్నాయి. సంఘటన స్థలికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.