ఇరాక్‌లో వరుస బాంబు దాడులు.. 31 మంది మృతి

బాగ్దాద్‌: బక్రీద్‌ పర్వదినం రోజున ఇరాక్‌ రక్తమోడింది. వరుస బాంబు దాడులతో ముష్కరులు తెగబడ్డారు..  వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనల్లో 31 మందికి పైగా మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బాగ్దాద్‌లోని సర్డ్‌ పట్టణంలో  చోటుచేసుకున్న జంట పేలుళ్లలో 14 మందికి పైగా మృత్యువాతపడ్డారు. బగ్దాద్‌కు సమీపంలో షియా ముస్లింలతో వెళ్తున్న బస్సు లక్ష్యంగా మరో బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అల్‌-మామెల్‌ మార్కెట్‌లో జరిగిప మరో  పేలుడు ఘటనలో ఐదుగురు చనిపోయారు. సున్నీ ముస్లింలు నివసించే మోసుల్‌ నగరంలో జరిగిన దాడుల్లో ఐదుగురు మృతి చెందారు. రాజధానికి సమీపంలోని బవియా ఆట మైదనాంలో బాంబు పేలుడుతో  పలువురు చిన్నారులు మృతి చెందారు.