ఇరిగేషన్ అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష
హైదరాబాద్: సచివాలయంలో ఇరిగేషన్ అధికారులతో నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. లెండి, పెనుగంగ, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులపై సమావేశంలో చర్చిస్తున్నారు. పెండింగ్ పనుల పూర్తికి కావాల్సిన నిధులపై సమగ్ర సమాచారం అందించాలని మంత్రి అధికారులను కోరారు. మిషన్ కాకతీయ పనులు నిర్వహించే చెరువుల సమాచారం పూర్తిగా ఇంజినీర్ల వద్ద ఉంచుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.