ఇసుక రవాణా సక్రమంగా జరిగేందుకు అధికారులు తప్పనిసరిగా తనిఖీలు చేయాలి
-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి.
గద్వాల నడిగడ్డ, ఏప్రిల్ 4 (జనం సాక్షి);
ఇసుక రవాణా సక్రమంగా జరుగుతున్నదా లేదా అధికారులు తప్పని సరిగా తనిఖీలు చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు.
మంగళవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు తాసిల్దారులతో ఇసుక కమిటి సమావేశంలో ఇసుక రవాణాపై సమావేశం నిర్వహించారు. మండలాలో ట్రాక్ట ర్ లోడ్ తో ఇసుక కనిపిస్తే సీజ్ చేయాలనీ అన్నారు. ఆన్లైన్ పద్ధతి ద్వారా ఎక్కడెక్కడ సరఫరా అవుతున్నదో విచారించాలన్నారు. సిసి రోడ్ల నిర్మాణంలో ఎక్కడి నుండి ఇసుక వస్తున్నదో పూర్తిగా వివరాలు తెలుసుకోవాలని, మన ఇసుక వాహనం ద్వారా ఇసుక రవాణా జరగాలని, రాజోలి మండలం తుమ్మిళ్ళ లో పుడిక పద్దతిలో ఇసుక తీయడం జరగాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గ్రౌండ్ వాటర్, మైనింగ్, ఇరిగేషన్ అడికరులందరూ కలిసి గుర్రం గడ్డ కృష్ణ నదిలో 5.250 క్యూబిక్ మీటర్ల ఇసుక పాయింట్ ను గుర్తించామని ఏ డి మైన్స్ అధికారి కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.జిల్లాలోని గుర్రం గడ్డ తుమ్మెళ్ళ ప్రాంతాల ఇసుక తనిఖీ చేయాలన్నారు.
సమావేశం లో ఆర్ డి ఓ రాములు, ఏడి మైన్స్ విజయ రమ రాజు, ఇరిగేషన్ రహీముద్దిన్, శ్రీనివాసులు పంచాయత్ రాజ్ ఈ ఈ ఆంజనేయులు తహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.