ఇసుక ,లిక్కర్ మాఫియాలపై ఉన్న ప్రేమ అలంపూర్ అభివృద్ధిపై లేని టిఆర్ఎస్ నాయకులు

ఇసుక ,లిక్కర్ మాఫియాలపై ఉన్న ప్రేమ అలంపూర్ అభివృద్ధిపై లేని టిఆర్ఎస్ నాయకులు
-అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్.
గద్వాల నడిగడ్డ, ఏప్రిల్ 4 ( జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లావడ్డెపల్లి మండలంలో కొనసాగుతున్న  హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా  మంగళవారము ఏఐసీసీ కార్యదర్శి అలంపూర్ మాజీ శాసనసభ్యులు సంపత్ కుమార్ రామాపురం,కోయిలదిన్నె గ్రామంలో పర్యటిస్తూ ప్రజలతో మమేకమై చేయి చేయి కలుపుతూ  ప్రతి గడపను తట్టుతు అడుగు ముందుకేస్తున్నారు.ఈ సందర్భంగా సంపత్ కుమార్   ప్రతి గడపను తట్టుతూ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇసుక లిక్కర్ మాఫియాలపై ఉన్న ప్రేమ అలంపూర్ అభివృద్ధిపై  టిఆర్ఎస్ నాయకులకు లేదని, మోసపూరితమైన హామీలు ఇచ్చి అధికారాన్ని దక్కించుకొని ప్రజల సంక్షేమాన్ని తుంగలో తొక్కా రణి టిఆర్ఎస్ పై సంపత్ కుమార్ విరుచుకుపడ్డారు.మూడు ఎకరాల భూమి ఇస్తామని, డబల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని ,రైతు రుణమాఫీ చేస్తామని మోసం చేశారనీ, ఇక పై మోసపోవద్దని ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని తెలియజేస్తూ ప్రతి సంక్షేమ పథకాన్ని కాంగ్రెస్ నిర్వర్తిస్తుందని తెలియజేస్తూ ప్రతి వారి సమస్యలను తెలుసుకుంటూ వారి కష్టాలకు భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో రాబోయేది  ,రైతు రాజ్యమని,ఉత్సాహం నింపారు, బానిసలుగా బతుకుతున్న అలంపూర్ ప్రజల బతుకులు మారే రోజులు ఆసన్నమైందని ప్రజలతో  తేల్చి చెప్పారు.నియంత్రత్వ అవినీతి పాలన అంతమొందించే సమయం ఆసన్నమైందని ఇక కొద్ది రోజులు సమయం ఉందని వచ్చేది కాంగ్రెస్ రాజ్యమేనని భరోసానిచ్చారు.టిఆర్ఎస్ పాలనతో అలంపూర్ లో అన్ని వర్గాల ప్రజలు కష్టాల్లో ఉన్నారని ప్రభుత్వ నిర్లక్ష్యంతో సంక్షేమ పథకాలు అమలు కాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని సంపత్ కుమార్ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరుతుందని భరోసానింపారు.టిఆర్ఎస్ పాలనతో విసుకు చెందిన ప్రజల కష్టాలను తెలుసుకుంటూ యాత్రలో ముందుకు సాగుతుండగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో సంపత్ కుమార్ గారితో పాటు రామాపురం జగదీశ్వర్ గౌడ్, నాగరాజు, రామకృష్ణ, సుజాత, రామాపురం వడకల తిక్కయ్య, వజీరు, గంగెద్దు రాముడు , వెంకటేశ్వర్ రెడ్డి, సర్దార్ మండల నాయకులు కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు