ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అభినందనలు

శ్రీహరికోట: పీఎస్‌ఎల్వీ- సీ21 ప్రయోగం విజయవంతం కావడంతో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఇస్రో వందో ప్రయోగాన్ని ప్రధాని ప్రత్యక్షంగా వీక్షంచారు. ప్రయోగ విజయవంతం సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ… సమాజానికి మేలు మరెన్నో ప్రయోగాలు చేపట్టాలని కోరారు. 43 ఏళ్ల చరిత్రలో వందో ప్రయోగం విజయవంతం కావడంతో భారత్‌ సుస్థిరస్థానం సంపాదించిందని హర్షం వ్యక్తం చేశారు.