ఈజిప్టు అధ్యక్షుడి విశేష అధికారాలు రద్దు

కైరో: ఈజిప్టు అధ్యక్షుడు మోర్సీ ప్రజాందోళనలకు తలొగ్గారు. తనకు విశేష అధికారులు కట్టబెట్టే వివాదాస్పద ఏకపక్ష ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు శనివారం రాత్రి ప్రకటించారు. గత నెల 22న జారీ చేసిన ఉత్వర్వులను రద్దు చేశారు. అయితే డిసెంబర్‌ 15న చేపట్టనున్న ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం యథావిధిగా జరగనున్నట్లు ఇస్లామిస్ట్‌ ప్రతినిధి మొహమ్మద్‌ సెలీమ్‌ అల్‌ అవ తెలిపారు. అధ్యక్షుడి కొత్త రాజ్యాంగంపై గత రెండు వారాలుగా ఈజిప్టులో ఆందోళన కార్యక్రమాలు మిన్నంటాయి.