ఈ నెల 24 నుంచి విజ్ఞానోత్సవ్‌

హైదరాబాద్‌: విజ్ఞాన్‌ విద్యాసంస్థల ఆధ్వర్యంలో మరోమారు విజ్ఞానోత్సవ్‌ నిర్వహిస్తున్నట్లు విజ్ఞాన్‌ గ్లోబల్‌ జెన్‌ స్కూల్స్‌ వైన్‌ ఛైర్మన్‌ రాణి రుద్రమదేవి ప్రకటించారు. విద్యార్థులో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఈ పోటీలను నిర్వహస్తున్నట్లు ఆమె చెప్పారు. ఈ నెల 24 నుంచి 28 వరకు ఈపోటీలు జరుగుతాయన్నారు. కళలు, క్రీడలు, భాషా నైపుణ్యం వంటి వివిధ రంగాల్లో బాలలను ప్రోత్సహించేందుకు ఈ ఉత్సవం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ పోటీలను ఈ నెల 24, 25 తేదీల్లో హైదరాబాద్‌, విశాఖపట్నం, గుంటూరు, ఏలూరు, రాజమండ్రిలలో నిర్వహిస్తామన్నారు. ఇందుకోసం ఈ నెల 23 సాయంత్రంలోగా విజ్ఞాన్‌ స్కూల్స్‌లో పేర్లు నమోదు చేసుకోవచ్చునన్నారు. ఈ నెల 27, 29 తేదీల్లో గుంటూరులో ఫైనల్‌ పోటీలు నిర్వహించి విజేతలకు రూ. ఐదు లక్షల విలువైన బహుమతులను అందిస్తామన్నారు.