ఈ నెల 4న దేశవ్యాప్త కళాశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపు

హైదరాబాద్‌: అవినీతిలో కూరుకుపోయిన యూపీఏకు వ్యతిరేకంగా ఈ నెల 4న దేశ వ్యాప్త కళాశాలల బంద్‌కు ఏబీవీపీ, యూత్‌ అగెనెస్ట్‌ సంస్థ సంయుక్తంగా పిలుపునిచ్చాయి. ప్రధాని పర్యవేక్షణలో బొగ్గు కుంభకోణం జరగడం దేశానికి అవమానకరమని ఏబీవీపీ జాతీయ కార్యదర్శి కడియం రాజు అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా చేపడుతున్న ఈ బంద్‌కు విద్యార్థులు, తల్లిదండ్రులు, యాజమాన్యాలు సహకరించాలని  తెలిపారు.