ఈ నెల 9నుంచి విద్యాపక్షోత్సవాలు:సీఎం

హైదరాబాద్‌:రాష్ట్రంలో 9నుంచి 21వరకు విద్యాపక్షోత్సవాలు నిర్వహిస్తున్నామని,ఇందుకు అవసరమైన అన్ని చర్యలను క్షేత్ర స్థాయిలో తీసుకోవాలని సీఎం ఆదేశించారు.ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ రోజు సచివాలయంలో విద్యాపక్షోత్సవాలు,మాద్యవిక,ప్రాధమిక విద్యాశాఖల తీరుతెన్నులు వంటి అంశాలను సమీక్షించారు.మంత్రులు పార్థసారధి,శైలజానాథ్‌,సహ ఇతర ఉన్నతాదికారులు పాల్గొన్నారు.రాష్ట్రంలో బడి బయట ఉన్న బాలలందరినీ బడిలో చేర్పించటం ఈ పక్షోత్సవాల ఉద్దేశమని సీఎం స్పష్టం చేశారు.