ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి.
తెలంగాణ దండోరా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్మురి రాములు మాదిగ.
కిషన్ రెడ్డి ఇంటి ముందు మాదిగ డప్పుల దండోరా నిరసన కరపత్రాలు విడుదల.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్ 3(జనంసాక్షి):
బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేపడతామని చెప్పి అధికారంలోకి వచ్చాక మాటతప్పి మాదిగలను మోసం చేసినందుకు నిరసనగా వచ్చే ఈ నెల 19న కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి ఇంటి ముందు మహా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ముత్యపాగ నర్సింగ్ రావు మాదిగ, తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు మీసాల రాము మాదిగ, తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గడ్డ యాదయ్య మాదిగ ల ఆధ్వర్యంలో కిషన్ రెడ్డి ఇంటి ముందు మాదిగ డప్పుల దండోరాతో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు తెలంగాణ దండోరా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్మురి రాములు మాదిగ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలో ని అంబేడ్కర్ విగ్రహం ముందు తెలంగాణ దండోరా నాగర్ కర్నూల్ తాలూకా అధ్యక్షుడు భీమయ్య మాదిగ ఆధ్వర్యంలో మాదిగ డప్పుల దండోరా కరపత్రాలను విడుదల చేశారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ దండోరా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్మూరి రాములు మాదిగ హాజరై మాట్లాడుతూ మాదిగల చిరకాల స్వప్నమైన ఎస్సీ వర్గీకరణను ఈ పార్లమెంట్ సమావేశాల్లో చట్టబద్ధత కల్పించాలని లేనిపక్షంలో బిజెపి ఎంపీల ఇండ్లముందు మాదిగ డప్పుల దండోరాతో నిరసన తెలియజేస్తామని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ దండోరా నాగర్ కర్నూల్ పార్లమెంటు ఇంచార్జి మంతటిగోపి మాదిగ,తెలంగాణ దండోరా నాగర్ కర్నూల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు బాకీ రేణుక మాదిగ, తెలంగాణ దండోరా జిల్లా ప్రధాన కార్యదర్శి ములకలపల్లి వెంకటయ్య, తాడూరు మండల అధ్యక్షురాలు రేణుక మాదిగ, జిల్లా సీనియర్ నాయకులు సుఖ వెంకట్ స్వామి, బాలు మాదిగ, నాగర్ కర్నూల్ మండల అధ్యక్షుడు కోతి మధు మాదిగ, తెలంగాణ దండోరా జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.