ఈ రెండేళ్లు పార్టీకి కీలక సమయం : అద్వానీ
న్యూఢిల్లీ : 2013 – 14 లో ఎప్పుడైనా లోక్ సభకు ఎన్నికలు రావచ్చుని భాజపా సీనియర్ నేత అద్వానీ అన్నారు. ఈ రెండేళ్లు పార్టీకి అంత్యంత కీలకమైన సమయమని ఆయన పేర్కొన్నారు. రాజ్ నాథ్‌సింగ్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం అద్వానీ పార్టీ కార్యలయంలో మాట్లాడారు. చాలాకాలంగా భాజపా నగరాలకు చెందిన పార్టీ అనే పేరుందని.. అయితే అది అవాస్తవమని అన్నారు. ఇప్పుడు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోని గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే పార్టీ పరిస్ధితి ఎంటనేది తెలుస్తుందని చెప్పారు. తెలిపారు. గత నాలుగేళ్లలో రాజకీయాల్లో అవినీతిపై తీవ్రమైన చర్చ జరుగుతుందని, అయితే ఎలాంటి అవినీతి మచ్చ లేని వ్యక్తి రాజ్‌నాథ్ అని పేర్కొన్నారు. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో పార్టీ అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉందని.. అలాంటి రాష్ట్రంలో రాజ్‌నాథ్ పునర్ వైభవం తీసుకురాగలరన్న నమ్మకం తనకుందని అన్నారు.