ఉగాది సందర్భంగా భీమన్న ఆలయం వద్ద అన్నదాన
సత్రంఉగాది సందర్భంగా భీమన్న ఆలయం వద్ద అన్నదాన సత్రం
ఎర్గట్ల మార్చి 21 (జనంసాక్షి) నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలంలోని భీమన్న ఆలయం వద్ద బుధవారం రోజు బర్మా వారి పెద్ద సంఘం ఆధ్వర్యంలో ఉగాది పండుగను పురస్కరించుకొని ప్రతి ఉగాది పండుగ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని బర్మా వారి పెద్ద సంఘ అధ్యక్షులు ఇందూరి పెద్ద సాయన్న,, ఉపాధ్యక్షుడు దండవోయినా చిన్న సాయన్న తెలియజేశారు. అనంతరం అధ్యక్షులు ఇందూరి పెద్దసాయిన మాట్లాడుతూ కొన్ని సంవత్సరల నుండి ఈ అన్నదాన కార్యక్రమం మా ముదిరాజ్ సంఘ సభ్యులు అందరూ సమిష్టిగా కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తానని తెలియజేశారు. కావున ప్రతి భక్తుడు వచ్చి అన్న ప్రసాదం ను స్వీకరించవలసిందిగా కోరుచున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.