ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ జమ్ముకశ్మీర్‌ శాసనసభ తీర్మానం

హైదరాబాద్‌: సాంబా, కథౖవా జిల్లాల్లో ఉగ్రవాదుల దాడులను ఖండిస్తూ జమ్ముకశ్మీర్‌ శాసనసభ తీర్మానం చేసింది. ఉగ్రవాదుల దాడి అంశాన్ని పాకిస్థాన్‌తో కేంద్రం ప్రస్తావించాలని శాసనసభ తీర్మానం చేసింది. అంతకు ముందు నేషనల్‌కాన్ఫరెన్స్‌ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ తిరస్కరించడంతో ఆపార్టీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఉగ్రవాదుల దాడిని జమ్ముకశ్మీర్‌ సీఎం ముఫ్తీ మహమ్మద్‌ సయీద్‌ ఖండించారు. శాంతి చర్చల ప్రక్రియకు ఇలాంటి ఘటనలు విఘాతం కలిగిస్తాయన్నారు. శాంతి కోరుకుంటే ఉగ్రవాదాన్ని పాక్‌ నియంత్రించాలని ముఫ్తీ మహమ్మద్‌ అన్నారు.