ఉచిత వైద్య శిబిరం

బూర్గంపహాడ్ మార్చి 14 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం తాళ్ల గుమ్మూరు ఐటిసి ఫంక్షన్ హాల్ నందు ఐకెపి వివోఏ మేక వసంత ఆధ్వర్యంలో బ్రింద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్వాహకులు గుర్రం సత్యనారాయణ నిపుణులైన వైద్యులచే ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైద్య శిబిరం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక తహసీల్దార్ ముజాహిద్, ఎంపీడీవో జమలారెడ్డి హాజరయ్యారు. ఈ వైద్య శిబిరాన్ని స్థానిక తహసిల్దార్ ప్రారంభించారు. వైద్య శిబిరంలో సారపాక పరిసర ప్రాంత 300కు పైగా ప్రజలకు వైద్య పరీక్షలు చేసి వారికి వైద్యుల పర్యవేక్షణలో తగిన మందులు అందించారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ పి పవన్ (ఎం.డి), డాక్టర్ కృష్ణ (ఎం. డి. జన్) డాక్టర్ సాత్విక్ (ఎంబిబిఎస్) డాక్టర్ వసుధ (ఎంబిబిఎస్) డాక్టర్ రామస్వామి (జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్) మరియు వారి సిబ్బంది రోగులకు వైద్య సేవలను అందించారు. ఈ సందర్భంగా బ్రింద హాస్పిటల్ నిర్వాహకులు సత్యనారాయణ మాట్లాడుతూ ఈ ప్రాంత పేద ప్రజలకు 50 శాతం రాయితీతో వైద్య సేవలను అందించడమే కాకుండా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన వారికి ఏడు రోజులపాటు నిత్యవసర సరుకులను అందజేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం పి ఓ, ఏపీఎం, ఎ పి జి వి బి మేనేజర్, స్థానిక పంచాయితీ కార్యదర్శి, ఐకెపి సిబ్బంది, వివోఏ లు తదితరులు పాల్గొన్నారు.