ఉద్యమకారులను రజాకార్లతో పోల్చటం తగదు : కేకే

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమకారులను రజాకార్లతో పోల్చటం ఉండవల్లికి తగదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కె. కేశవరావు అన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో శనివారం అయన విలేకరులతో మాట్లాడుతూ వేలాదిమంది గిరిజనుల ప్రాణాలు తీసి పోలవరం నిర్మిస్తారా అని ప్రశ్నించారు.పోలవరం జలాశయం నిర్మాణానికి ఒప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.