ఉద్యమాన్ని ఉధృతం చేస్తేనే తెలంగాణ

ధర్మారం : తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతంగా చేసినప్పుడే ప్రత్యేక రాష్ట్రం సిద్ధిస్తుందని తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ అధ్యక్షుడు గద్దర్‌ అన్నారు. ధర్మారం మండలం అబ్బాస్‌పూర్‌లో నిర్వహించిన బీరప్పదేవుని ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంÛగా గద్దర్‌ మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ఉధ్యమంలో అన్నివర్గాలను భాగస్వాములను చేయాలన్నారు. జాతి వర్గాలకు రాజ్యాధికారం వస్తేనే సమానత్వం నెలకొంటుందని కుమార్‌ స్పష్టం చేశారు. గొల్ల కురుమల సమస్యలపై పాటలు పాడారు. గద్దర్‌ను చూసేందుకు స్థానికులు పోటీ పడుతుండతంతో తొక్కిసలాట జరగింది.