ఉన్నతాధికారులతో సభాపతి భేటీ

హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభాపతి నాదెండ్ల మనోహర్‌ ఈరోజు ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. శాసనసభ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రశ్నోత్తరాలు, శూన్యగంట, పలు ఇతర అంశాలపై అధికారులతో ఆయన చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.