ఉన్నత ప్రతిభ కోసం విద్యార్థులు కృషి చేయాలి:కపిల్‌సిబాల్‌

హైదరాబాద్‌: విద్యార్థులు ఉన్నత ప్రతిభకోసం కృషి చేయాలని కపిల్‌ సిబాల్‌ అన్నారు. బాట్స్‌పిలానీ హైదరాబాద్‌ క్యాంపస్‌లో మొదటి స్నాతకోత్సవ కార్యక్రమానికి కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ముఖ్య అతిధిగా కపిల్‌సిబాల్‌ హాజకయ్యారు. విద్యార్థులు నేర్చుకున్న విద్యాను సమాజ శ్రేయస్సుకోసం ఉపయోగించాలన్నారు. యువత చేతిలోనే ప్రతిభ ఉందని, ఉన్నత విద్యాకోసం కౄషిచేయాలని ఆయన అన్నారు. 413మంది విద్యార్థులకు పట్టాలు అందచేశారు.