ఉన్నత ప్రమాణాలతో విద్యనందించటమే లక్ష్యం ఉప ముఖ్యమంత్రి

హైదరాబాద్‌ : కళాశాలల్లో విద్యాప్రమాణాలను పెంచటంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడబోదని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ప్రమాణలు సరిగా లేని కళాశాలలు సవరించుకోవాలని ఆయన ఇవాళ హైదరాబాద్‌లో సూచించారు. కూకట్‌ పల్లి జేఎన్‌టీయూ ప్రాంగణంలో రూ. 6.37 కోట్లతో నిర్మంచిన కిన్నెర బాలుర వసతి గృహాన్ని ఉప ముఖ్యమంత్రి ప్పారంభించారు. విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో విద్యనందించటమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. కోర్టు ఆదేశాల మేరకు కళాశాలల పై టాస్క్‌ ఫోర్స్‌ తనిఖీలు జరిపి వాటి వివరాలను కోర్టుకు నివేదిస్తామని చెప్పారు. మెదక్‌ జిల్లా సంగారెడ్డ సమీపంలోగల సుల్తాన్‌పూర్‌ వద్ద జెఎన్‌యూ నిర్మాణపనులను రూ.303 కోట్లతో ప్రారంభించామని, దీనికి 48 మంది భోధన, 16 మంది బోధనేతర సిబ్బంది పోస్టులు మంజూరయినట్లు ఉప ముఖ్యమంత్రి తెలియజేశారు.