ఉపరాష్ట్రపతి ఎంపిక మా పని కాదు

కరుణానిధి
చెన్నై : రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ప్రత్యేక ఆసక్తి చూపించిన యూపీఏ మిత్రపక్షం డీఎంకే, ఉప రాష్ట్రపతి విషయంలో మాత్రం తన వైఖరిని స్పష్టం చయటానికి నిరాకరించింది. ఉప రాష్ట్రపతి పదవి ఎంపిక తమ పని కాదని పార్టీ అధ్యక్షుడు కరుణానిధి మంగళవారం విలేకరులతో పేర్కొన్నారు. యూపీఏ తమ ఉపరాష్ట్రపతి అభ్యర్తిగా హమీద్‌ అన్సారీ పేరును మరోమారు ప్రతిపాదిస్తే దక్షణాది నుంచి మీరు మీ అభ్యర్తిని ప్రకటిస్తారా అని విలేకరులు ప్రశ్నించారు. దీనికి కరుణ స్పందిస్తూ… రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి పదవులు ప్రాంతాల ఆధారంగా కేటాయించేవి కావని బదులిచ్చారు. రాష్ట్రపతి ఎంపిక నిర్ణయం అప్పటి రాజకీయ పరిస్థితికి అనుగుణంగా తీసుకున్నదని కరుణ పేర్కొన్నారు.