ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి గోపాలకృష్ణ నిరాకరణ

న్యూఢిల్లీ:ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడానకి పశ్చిమబెంగాల్‌ మాజీ గవర్నర్‌ గోపాలకృష్ణ గాంధీ నిరాకరించారు.అభ్యర్థిత్వంపై తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి వెనక్కి తగ్గడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా హమీద్‌ అన్సారీని యూపీఏ నిన్న ప్రకటించింది మరోవైపు అభ్యర్థి విషయంలో భాజపా తర్జనభర్జన పడుతోంది జనతాదళ్‌ నేత శరద్‌యాదవ్‌ లేదా జశ్వంత్‌సింగ్‌ను భాజపా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.