ఉపరాష్ట్రపతి పోరులో అన్సారీ, జశ్వంత్‌ ముఖాముఖి

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల మాదిరిగానే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ ముఖాముఖి పోరు జరుగనుంది. శనివారం చేపట్టిన నామినేషన్ల పరిశీలన యూపీఏ అభ్యర్థి హమీద్‌ అన్సారీ, ఎన్డీయే అభ్యర్థి జశ్వంత్‌ సింగ్‌ల పఆరతల మాత్రమే సక్రమంగా ఉన్నట్లు తేలింది. ఎంపీల మద్దతు ప్రతిపాదనలు, ఇతరత్రా పత్రాలు లేని కారణంగా 29మంది ఇతరుల నామినేషన్లను తిరస్కరించారు. మొత్తం 31మంది అభ్యర్థుల తరుపున 42నామినేషన్‌లు దాఖలయ్యాయి. వాటిలో అన్సారీ తరపున వేసిన నాలుగు సెట్లు, జశ్వంత్‌సింగ్‌ తరుపున దాఖలైన మూడు సెట్లు మాత్రమే ఆమోదం పొందినట్లు రిటర్నింగ్‌ అధికారి టి.కే.విశ్వనాథన్‌ తెలిపారు. జులై 14వ ఉపరాష్ట్రపతి ఎన్నిక ఆగస్టు 7న జరుగుతుంది. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు మాత్రమే ఈ ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది.