ఉపాధి హామీలో రైతులకు టేకు మొక్కలు

శ్రీకాకుళం, మే 27 (జనంసాక్షి):
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రైతులకు టేకు మొక్కలు సరఫరా చేయనున్నట్టు జిల్లా కలెక్టర్‌ జి. వెంకట్రామిరెడ్డి తెలిపారు. జిల్లాలో 20 లక్షల మొక్కలు అవస రమని అంచనా వేశామన్నారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో ఉపాధి హామీ పురోగతిపై కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 800 వరకు మొక్కలు సరఫరా చేయనున్నట్టు తెలిపారు. ఇందుకోసం మండలా భివృద్ధి అధికారి, ఉపాధి హామీ సహాయ ప్రాజెక్టు అధికారిని సంప్రదించాలన్నారు. మూడేళ్ల వరకు వీటి నిర్వహణకు సంబంధించి నిబంధనల మేర కు సొమ్ము చెల్లిస్తామన్నారు. పొందూరు, రణస్థల ం కంచిలి, ఎచ్చెర్ల, వంగర, రాజాం, సరుబుజ్జిలి, హిర మండలం, పాత పట్నం, ఆమదాల వలస మిలియాపుట్టి మండలాల్లో తక్కువ మంది కూలీలు వస్తున్నారని వారి సంఖ్య పెంచేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి కుటుంబా నికి జూన్‌ చివరి నాటికి 50 రోజులు పని కల్పించాలని అన్నారు. వేతనం తక్కువ రావడాని కి నిర్ణీత కొలతల్లో పని జరగకపోవడం, మస్టర్లలో తప్పుడు లెక్కలే కారణమన్నారు. వర్షా కాలంలో పనులకు ఇబ్బంది కలగకుండా ముందుగానే గుర్తించాలన్నారు. డీలపట్టి పనులను నాణ్యాతా పరిశీలన సంస్థ ద్వారా త్వరతి గతిన తనిఖీ చేయించి, నీటి ప్రవాహానికి ఆటంకానికి చర్యలు చేపట్టాలన్నారు. ప్రధాన కాలువలు, ఫీడర్‌ చానల్‌ ఉప కాలువల పనులు చేపట్ట వచ్చని చెప్పారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ ఏ కల్యాణ చక్రవర్తి, ఆంధ్రబ్యాంకు చైర్మన్‌ మదన్‌మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.