ఉపాధ్యాయులంతా ఐక్యం కావాలి: శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌: అక్టోబర్‌ 5న జరగనున్న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం ”ఆప్టా” రూపొందించిన ప్రత్యేక లోగో, పోస్టర్‌ను రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి డి. శ్రీధర్‌బాబు మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఉపాధ్యాయులందరూ ఐక్యమైతే విశ్వమానవాళి సుఖశాంతుశాలతో వర్ధిల్లుతుందన్నారు. అక్టోబచ్‌ 5న ఆప్టా రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్‌ రవీంద్రభారతిలో జరగనున్న ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకోబోతున్న ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, ఐఏఎస్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వ విద్యాధికారులు, అన్ని జిల్లాల ఉపాధ్యాయ ప్రతినిధులు పాల్గొంటారని ఆయన అన్నారు.