ఉప్పల్‌ చేరుకున్న చంద్రబాబు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 12 : వరంగల్‌ జిల్లా పర్యటనకు బయలుదేరిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉప్పల్‌ చేరుకున్నారు. చంద్రబాబు రాక సందర్భంగా భారీగా చేరుకున్న టీడీపీ నేతలు, కార్యకర్తలు బాబుకు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి భువనగిరి, ఆలేరు, వరంగల్‌, ఖాజీపేట మీదుగా బాబు హన్మకొండ చేరుకోనున్నారు.