ఉభయసభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా

ఢిల్లీ: బొగ్గు కుంభకోణంపై ఎనిమిదో రోజూ పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళన చేపట్టాయి. ప్రధాని రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీలు డిమాండ్‌ వ్యక్తం చేస్తూ స్పీకర్‌ వెల్‌లోకి దూసుకువెళ్లారు. దీంతో స్పకర్‌ మీరాకుమార్‌ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మరో వైపు రాజ్యసభలో కూడా విపక్షాలు సభను జరగనివ్వకుండా నినాదాలు చేయడంతో ఛైర్మన్‌ సభును వాయిదా వేశారు.