ఉభయసభలు మధ్యాహ్నం 12 వరకు వాయిదా

ఢిల్లీ: పార్లమెంటు ఉభయసభలు ప్రారంభమైన కొద్ది నిమిషాలకే మధ్యాహ్నం 12 గంటలకు వరకు వాయిదా పడ్డాయి. బొగ్గు కుంభకోణంపై ఉభయసభల్లోనూ విపక్షాలు ఆందోళన చేశాయి. ప్రధాని రాజీనామాకు పట్టుబట్టాయి. దాంతో సమావేశాలు వాయిదా పడ్డాయి. బొగ్గు కుంభకోణం కారణంగా చట్ట సభలు ఇలా వాయిదా పడడం వరసగా ఇది 11వరోజు.