ఉషామెహ్రా కమిటీ సిఫార్సులు అమలుచేయాలి: చంద్రబాబు

హైదరాబాద్‌: ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఉషామెహ్రా కమిటీ సిఫార్సులు అమలుచేయాలని కోరుతూ ప్రధానికి లేఖ రాయనున్నట్టు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తెలిపారు. వర్గీకరణపై మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి ఏర్పాటుచేసిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న బాబు ప్రసంగిస్తూ వర్గీకరణ కోసం జాతీయస్థాయిలో రాజకీయపక్షాల మద్దతును కూడగట్టుతామన్నారు.