ఎంఐఎం పొలిట్‌బ్యూరో అత్యవసర భేటీ

హైదరాబాద్‌: పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయ వివాదం నేపధ్యంలో ఎంఐఎం అత్యవసర భేటీ నిర్వహించింది. నాంపల్లిలోని దారుసలాంలో ఈ రోజు ఎంఐఎం పొలిట్‌బ్యూరో సభ్యులు భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మద్దతు కొనసాగింపుపై మధ్యాహ్నం 12 గంటలకు కీలక ప్రకటన చేసే అవకాశమున్నట్లు సమాచారం.