ఎంజీఎంలో వెంటిలేటర్ల కొరతతో రోగి మృతి

వరంగల్‌: వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో వెంటిలేటర్ల కొరతతో శ్వాస అందక ఖిలా వరంగల్‌కు చెందిన శ్రీనివాస్‌ అనే వ్యక్తి మృతిచెందినట్లు సమాచారం. అనారోగ్యంతో నిన్న ఆస్పత్రిలో చేరిన శ్రీనివాస్‌ శ్వాస అందక ఇబ్బంది పడుతుండడంతో కృత్రిమ శ్వాస అందించేందుకు వైద్యులు అంబు బ్యాగ్‌తో చికిత్సను అందించే ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిలో శ్వాస అందక పరిస్థితి విషమించి శ్రీనివాస్‌ మృతిచెండాడని, మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బందువులు ఆరోపించారు.