ఎంతైనా సీమాంధ్ర సీఎం కదా పోలవరం నిర్మించి తీరుతాం

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ఏలూరు,ఆగస్టు 18 (జనంసాక్షి) :
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఆది వాసులు రోడ్డున పడుతారని తెలంగాణ వాదులు మొత్తుకుంటున్నా, ఏ మాత్రం పట్టించుకోకుండా ఆ ప్రాజెక్టును నిర్మించి తీరుతామని సీఎం కిరణ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన రెండో రోజు వెంకటరామన్న గూడెంలో పర్యటించి, స్థానిక రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం వారితో పోలవరం ప్రాజెక్టు నిర్మించ డానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని వెల్లడించారు. అంతే కాకుండా, పోలవరం పూర్తయితే గోదావరి నీళ్లు మహబూబ్‌నగర్‌ జిల్లాకు వస్తాయని వివరించారు. ఈ ఏడాది 4 వందల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలిసి పోయిం దని, అదే పోలవరం పూర్తయిత
ఈ నీరంతా రైతులకు ఉపయోగపడేదన్నారు. ఇదిలా ఉంటే, సీఎం కిరణ్‌ వ్యాఖ్యలపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. పోలవరం నిర్మాణంతో ఖమ్మం జిల్లాలోని 434 గ్రామాల ఆదివాసులు నిరాశ్రయులవుతారన్న విషయాన్ని సీఎం విస్మరిస్తున్నారని ఆరోపించారు. వెంటనే పోలవరం నిర్మాణంపై చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని, లేకుంటే ఆదివాసులకు ఏ మేరకు నష్ట పరిహారం ఇస్తారో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.